![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -498 లో..... సాగర్ బర్గర్ లు తీసుకొని వస్తాడు. నేను ఫ్రెషప్ అయి వస్తాను. కలిసి తిందామని సాగర్ లోపలికి వెళ్తాడు. సాగర్ తీసుకొని వచ్చిన బర్గర్ లు అన్ని ధీరజ్, ప్రేమ, తిరుపతి, నర్మద తింటుంటారు. అక్క నువ్వు కుడా తిను అని వేదవతితో తిరుపతి అంటాడు. తినాలని ఉందిరా కాకపోతే మీ బావ వస్తాడేమోనని వేదవతి అంటుంది. పర్లేదులే అక్క అని తిరుపతి అనగానే వేదవతి కూడా తింటుంది. అప్పుడే సాగర్ వస్తాడు.
ఏంటి నర్మద అని సాగర్ అనగానే నువ్వే కదా కలిసి తిందామన్నావని నర్మద అంటుంది. మనిద్దరం తిందామని అన్నాను వాళ్ళతో కాదు.. సిగ్గు లేదారా ఇలా తినడానికి ధీరజ్ తో సాగర్ అనగానే మా అన్నయ్య తెచ్చాడు తిన్నామని ధీరజ్ అంటాడు. ఇదిగో నువ్వు కూడా తినమని ధీరజ్ అనగానే సాగర్ దాన్ని విసిరేస్తాడు. అది రామరాజు చొక్కాపై అంటుకుంటుంది. అయ్యో సారీ మావయ్య మీ చొక్కాపై మరకలు అయ్యాయని నర్మద అంటుంది. వాడు చేసిన పనుల కంటే ఈ మరకలు ఎక్కువ కాదని అంటాడు. ఆ తర్వాత మరుసటిరోజు అమ్మాయిని పడెయ్యడానికి చిట్కాలు చెప్పమని ధీరజ్ ని తిరుపతి అడుగుతాడు. అమ్మాయిలకి బొద్ధింక అంటే భయం ఉంటుందని ధీరజ్ అంటాడు. అప్పుడే ప్రేమ వచ్చి బొద్ధింకనా ఎక్కడ అని ధీరజ్ చంకన ఎక్కుతుంది. ఇద్దరు రొమాంటిక్ గా చూసుకుంటుంటే నేను ఇక్కడే ఉన్నానని తిరుపతి అంటాడు. ఆ తర్వాత ప్రేమ ఎదురు వస్తుంది. ధీరజ్ కార్ డ్రైవింగ్ కి వెళ్తాడు.
మరొకవైపు ఆకలిగా ఉంది.. నా కడుపులో బిడ్డ ఆకలి అంటూ అరుస్తున్నాడని వల్లి అనగానే.. నీకు యాక్టింగ్ చేసి చేసి నా ముందు కూడా చేస్తున్నావని సుకన్య అంటుంది. అప్పుడే నర్మద వచ్చి అక్క నీ కోసం కొన్ని స్పెషల్ వంటలు చేశాను.. డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొని వస్తుంది. ప్రేమ ఒక ప్లేట్ పట్టుకొని వస్తుంది. ఆ ప్లేట్ పై ఒక క్లాత్ ఉంటుంది. అది చూసి నా చెల్లెళ్ళకి నేనంటే ఎంత ఇష్టమో అని వల్లి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |